»Godses Photo Video At Rajasingh Shobhayatra Goes Viral
Shobhayatra : రాజాసింగ్ శోభాయాత్రలో గాడ్సే ఫోటో వీడియో వైరల్
శ్రీరామనవమి (Sri Rama Navami) పురస్కరించుకుని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) నిర్వహించిన శోభాయాత్రలో మహాత్మాగాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే (Nathuram Godse) పోటో దర్మనం ఇవ్వడం కలకలం స్పష్టించింది. గురువారం దూల్పేట్లో ఆకాష్ పూరి హనుమాన్ మందిర్(Hanuman Mandir) లో ప్రత్యేక పూజల నిర్వహించిన అనంతరం రాజాసింగ్ ఈ శోభాయాత్రను ప్రారంభించారు.
శ్రీరామనవమి (Sri Rama Navami) పురస్కరించుకుని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) నిర్వహించిన శోభాయాత్రలో మహాత్మాగాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే (Nathuram Godse) పోటో దర్మనం ఇవ్వడం కలకలం స్పష్టించింది. గురువారం దూల్పేట్లో ఆకాష్ పూరి హనుమాన్ మందిర్(Hanuman Mandir) లో ప్రత్యేక పూజల నిర్వహించిన అనంతరం రాజాసింగ్ ఈ శోభాయాత్రను ప్రారంభించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున యువకులు, భక్తులు పాల్గొన్నాయి. అయితే ర్యాలీలో రాజాసింగ్ వాహనంపై ఉండగా కింద యువకులు ఉత్సాహంగా నృత్యం చేశారు.
ఈ క్రమంలో జైశ్రీరామ్(Jaishreeram) అనే జెండాలతో పాటు జాతిపిత మహాత్మాగాంధీని హతమార్చిన వ్యక్తి నాథూరామ్ గాడ్సే ఫోటోను ప్రదర్శించారు. ఆసిఫ్ నగర్ సమీపంలోని సీతారాంబాగ్ ఆలయం వద్ద శ్రీరామ నవమి శోభాయాత్ర (Shobhayatra) ప్రారంభమైంది. కొన్ని వందల మంది సభ్యులతో ప్రారంభమైన యాత్ర మంగళ్‌హాట్ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకునేసరికి భారీ ఊరేగింపుగా మారిపోయింది. రాజా సింగ్ సారథ్యంలో శ్రీరాం యువ సేన (Shri Ram Yuva Sena) ఆధ్వర్యంలో మరో ఊరేగింపు ప్రధాన శోభాయాత్రలో చేరింది. రాజా సింగ్ అనుచరులు ఈ యాత్రలో ప్రస్తుతం హిందూత్వవాదులకు ఆరాధ్యునిగా మారిపోయిన నాథూరాం గాడ్సే చిత్రపటాన్ని చేతిలో పట్టుకుని పాల్గొన్నారు. దీంతో ఈ ర్యాలీ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో(Social media) వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు యాక్షన్ తీసుకుంటారా అనేది ఉత్కంఠ రేపుతోంది.