»Mumbai Muslim Boy Beaten Up Mumbai Bandra Station Viral Video Hindu Girl Jai Shri Ram Chants
Mumbai: హిందూ అమ్మాయితో ఉన్నందుకు బాంద్రా స్టేషన్లో ముస్లిం బాలుడిపై దాడి
బాంద్రా టెర్మినస్ రైల్వే స్టేషన్లో ఓ ముస్లిం బాలుడిని కొందరు వ్యక్తులు ఎలా కిరాతకంగా కొడుతున్నారో వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిలబడ్డ ఓ పోలీస్ అధికారి కూడా వీడియోలో కనిపిస్తున్నారు.
Mumbai: ముంబైలోని బాంద్రా నుంచి ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ముంబైలోని బాంద్రా టెర్మినస్ రైల్వే స్టేషన్లో ఓ ముస్లిం బాలుడిని కొందరు వ్యక్తులు కొట్టడం వీడియోలో కనిపిస్తోంది. బాంద్రా టెర్మినస్ రైల్వే స్టేషన్లో ఓ ముస్లిం బాలుడిని కొందరు వ్యక్తులు ఎలా కిరాతకంగా కొడుతున్నారో వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిలబడ్డ ఓ పోలీస్ అధికారి కూడా వీడియోలో కనిపిస్తున్నారు.
ఓ ముస్లిం యువకుడు హిందూ యువతితో కలిసి రైలులో ప్రయాణిస్తున్నాడని, అతడిపై రైట్‌వింగ్‌కు చెందిన వారు దాడి చేశారని ఆరోపించారు. బాంద్రా స్టేషన్లో ‘జై శ్రీరామ్’, ‘వందేమాతరం’ నినాదాలు చేస్తూ దాదాపు 8 నుండి 10 మంది ముస్లిం బాలుడిని కొట్టడం ప్రారంభించారు. ఈ ఘటన జూలై 21న జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇన్ని రోజులు గడిచినా ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదు. కొట్టిన వారిని అరెస్టు చేయలేదు.
A shocking viral video has come to light of a mob beating a young man at Bandra station while the crowd is happily filming the incident. The young man, a Muslim, was travelling in a train with a young Hindu girl (allegedly a minor) when the mob chanting ‘Jai Shri Ram’ hit him… pic.twitter.com/eQgTIUjxtl
వైరల్ వీడియోపై AIMIM నాయకుడు వారిస్ పఠాన్ స్పందిస్తూ.. ఎవరైనా తప్పు చేస్తే దేశంలో చట్టం ఉంది. కానీ ఇలా కొట్టే హక్కు ఎవరు ఇచ్చారు? దీనిపై నిర్మల్ నగర్‌కు చెందిన ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ.. వైరల్ వీడియోను తాము గుర్తించామని.. ప్రస్తుతం ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు.