»Mans Viral Video Of Typical Workday In Antarctica Is Scary
Viral video: అంటార్కిటికాలో డోర్ కూడా పెట్టలేం..వీడియో మాములుగా లేదు!
అంటార్కిటికా(Antarctica)లో పనిదినం చాలా కష్టతరంగా(Typical workday) ఉంటుందని ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో రిలీజైన కొద్ది గంటల్లోనే విశేషమైన వ్యూస్ ను సంపాదించింది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
అంటార్కిటికా(Antarctica) వాతావరణంలో పనిచేయండం చాలా కష్టం. అక్కడి పరిస్థితులు నిత్యం సవాలు విసురుతుంటాయి. కనికరం లేని గాలులతో కూడిన విపరీతమైన ఉష్ణోగ్రతలు నిస్సందేహంగా అక్కడ ఉన్న పరిశోధకులను, శాస్త్రవేత్తల విషయాలను కఠినతరం చేస్తాయి. 47వ పోలిష్ అంటార్కిటిక్ ఎక్స్‌పెడిషన్‌కు అధిపతి అయిన టోమాస్జ్ కుర్జాబా ఇటీవల అటువంటి పరిస్థితులను ప్రజలతో పంచుకోవడానికి ఒక వీడియోను పంచుకున్నారు.
“అంటార్కిటికాలో సాధారణ పనిదినం అంటూ… ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో(vide0)ను పంచుకున్నారు. కింగ్ జార్జ్ ద్వీపంలో క్లిప్ క్యాప్చర్ చేయబడిందని కూడా అతనే అని చెప్పాడు. ఒక యాత్రికుడు తలుపు ముందు నిలబడి దానిని మూసివేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వీడియో తీశారు. కదులుతున్న రైలు డోర్‌ను మూసేయడానికి ప్రయత్నిస్తున్నట్లు మొదటి చూపులో కనిపిస్తోంది. అయితే, తలుపు వెలుపల కనిపించే బలమైన గాలి, మంచు అతన్ని సవాలు చేస్తున్నాయి.
వీడియో మే 8న పోస్ట్ చేయబడింది. షేర్ చేయబడినప్పటి నుంచి, క్లిప్ దాదాపు 25. 3 మిలియన్ల వీక్షణలను పొందింది. క్రమంగా వ్యూస్ సంఖ్యలు పెరుగుతున్నాయి. అదనంగా, షేర్‌కి అనేక లైక్‌లు, కామెంట్లు(comments) వచ్చాయి.
ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. “ఇది రైలు అని నేను అనుకున్నాను” అని ఒకరు వ్యాఖ్యానించారు. “కొత్త స్నోపియర్సర్ సిరీస్ వైల్డ్‌గా కనిపిస్తోంది” అని మరొకరు… “ఆగండి… ఇది కదులుతున్న రైలు కాదా?” అంటూ పలువురు స్పందిస్తున్నారు(reactions).