»Karnataka Medics Who Made Reels In The Hospital 38 Medical Students Suspended
Karnataka: ఆసుపత్రిలో రీల్స్ చేసిన మెడికోలు.. 38 మంది వైద్య విద్యార్థులు సస్పెండ్
ఇటీవల ఆపరేషన్ ధియేటర్లలో ఓ వైద్యుడు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినందుకు అతనిని సస్పెండ్ చేశారు. తాజాగా వైద్య విద్యార్థులు ఎలాంటి అనుమతి లేకుండా ఆసుపత్రిలో రీల్స్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆసుపత్రి యాజమాన్యం వాళ్ల మీద చర్యలు తీసుకుంది.
Karnataka: ప్రస్తుతం చాలామంది ఎక్కువగా సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. పాపులారిటీ లేదా టైమ్ పాస్ కోసం కొందరు రీల్స్ చేస్తుంటారు. తాజాగా కొందరు వైద్య విద్యార్థులు ఆసుపత్రిలోనే రీల్స్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆసుపత్రి యాజమాన్యం 38 మంది వైద్య విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఈ ఘటన కర్ణాటకలోని గడగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో జరిగింది. ఇక్కడ చదువుతున్న 38 మంది విద్యార్థుల ట్రైనింగ్ మరో 20 రోజుల్లో పూర్తవుతుంది.
ఇది కూడా చూడండి: FASTag: ఇకపై ఫాస్టాగ్ ప్లేస్‌లో జీపీఎస్ టోల్ కలెక్షన్
కొన్ని రోజుల్లో కళాశాలలో ప్రీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం కూడా జరగనుంది. దీనికోసం ఎలాంటి అనుమతి లేకుండా ఆసుపత్రిలోనే రీల్స్ చేశారు. వీడియో వైరల్ కావడంతో ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ విద్యార్థులకు జరిమానా విధించడంతో పాటు ట్రైనింగ్‌ను మరో 10 రోజులు పొడిగించింది. ఆసుపత్రిలో రీల్స్ చేసేందుకు యాజమాన్యం విద్యార్థులకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. వాళ్లు ఏం చేయాలనుకున్న రోగులకు ఇబ్బంది కలిగించకుండా ఆసుపత్రి వెలుపలు చేసుకోవచ్చని తెలిపారు.