kangana ranaut:కంగనా రనౌత్ (kangana ranaut).. ఫైర్ బ్రాండ్.. ఏ విషయం పైన అయినా సరే నిర్మొహమాటంగా మాట్లాడతారు. సుత్తి లేకుండా సూటిగా చెబుతారు. సినిమా విషయాలు (cinema), రాజకీయ అంశాలు (political), కరెంట్ ఇష్యూస్ గురించి కూడా కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా జనరేషన్ జెడ్ (generation z) గురించి మాట్లాడారు.
kangana ranaut:కంగనా రనౌత్ (kangana ranaut).. ఫైర్ బ్రాండ్.. ఏ విషయం పైన అయినా సరే నిర్మొహమాటంగా మాట్లాడతారు. సుత్తి లేకుండా సూటిగా చెబుతారు. సినిమా విషయాలు (cinema), రాజకీయ అంశాలు (political), కరెంట్ ఇష్యూస్ గురించి కూడా కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా జనరేషన్ జెడ్ (generation z) గురించి మాట్లాడారు. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారి గురించి మాట్లాడారు.
వీరికి క్రమశిక్షణ ఉండదని కంగనా స్టార్ట్ చేశారు. ‘హార్ట్ వర్క్ (hard work) చేయరు.. కష్టపడాలంటే తప్పించుకుంటారు. షార్ట్ కట్స్‌లో సక్సెస్ అయినవారికే రెస్పెక్ట్ ఇస్తారు. చేతులు, కాళ్లు కర్రల మాదిరిగా ఉంటాయని చెప్పారు. ఇంటరాక్ట్ కావడం, చదవడం కంటే ఫోన్లోనే (mobile) గడుపుతారు. మనసు కూడా స్థిరంగా ఉండదు. ఆఫీసులో బాస్‌ను (boss) గౌరవించరు.. కానీ ఆ పోజిషన్ కావాలని మాత్రం అనుకుంటారు. స్టార్ బక్స్, అవోకాడో టోస్ట్ లైక్ చేస్తారు.. కానీ సొంత ఇల్లును కొనుక్కునే స్థోమత ఉండదు. ఇతరులను అట్రాక్ట్ చేసేందుకు బ్రాండెడ్ దుస్తులు రెంట్‌కు తీసుకుంటారు. కమిట్ మెంట్ లేదంటే, పెళ్లిని ద్వేషిస్తారని’ కంగనా చెప్పారు.
అంతేకాదు చివరికీ వీరికి శృంగారం విషయంలో కూడా బద్దకంగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయని హాట్ కామెంట్స్ చేశారు. వీరిని ఈజీగా మార్చొచ్చు అని జనరేషన్ జడ్ గురించి కంగనా (kangana ranaut) తెలిపారు. కంగనా ప్రస్తుతం ఇందిరాగాంధీ బయోపిక్ ఎమర్జెన్సీలో (emergency) నటిస్తోన్న సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ నటి.. మణికర్ణిక (manikarnika) అనే మూవీని డైరెక్ట్ కూడా చేశారు. ఆ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేయడం ప్రారంభించారు. మధ్యలో విభేదాలు రావడంతో మూవీ నుంచి తప్పుకున్నారు. ఆ సినిమాను కంగనా పూర్తి చేశారు. కానీ ఆశించిన స్థాయిలో ఆ మూవీ ఆడలేదు.