In Chennai, two rowdy sheeters died in an encounter
Encounter: తమిళనాడు(Tamil Nadu)లో ఇద్దరు రౌడీషీటర్ల ఎన్కౌంటర్(Encounter) స్థానికంగా కలవరం రేపింది. సోమవారం అర్థరాత్రి చెన్నై(Chennai) సమీపంలోని గుడివంచెరి వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు రౌడీషీటర్లు మృతి(Rowdysheeters died) చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడివంచెరి ప్రాంతంలో పెట్రోలింగ్(Patrolling) నిర్వహిస్తున్న పోలీసులకు ఒక ఎస్యూవీ వాహానం అనుమానాస్పదంగా కనిపించింది. తనిఖీ నిమిత్తం దాన్ని ఆపడానికి ప్రయత్నించారు. ఆ వాహానం ఆపకపోగా, వేగంగా పోలీసు కారును ఢీ కొట్టింది. అందులో ఉన్న నలుగురు వ్యక్తులు అధికారులపై దాడికి యత్నించారు. ప్రతిఘటించిన పోలీసులపై బాంబు విసరడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని వెల్లడించారు. దాంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వెంటనే వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా.. మరణించారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే మృతిచెందిన వారు పలుకేసుల్లో నిందితులుగా ఉన్నారని, మిగితా ఇద్దరు వ్యక్తులు పారిపోయారని, ఆ ఘటనలో సబ్ఇన్స్పెక్టర్ గాయపడ్డారని పేర్కొన్నారు. ఇక పారిపోయిన ఇద్దరు వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు.
#WATCH | Tamil Nadu | Two history sheeter shot dead by police at around 3.30 am today after they attacked police officials with a sickle at Guduvanchery on the outskirts of Chennai. pic.twitter.com/Qx7ldYsh2w