Salman Khan: సల్మాన్ ఖాన్ను చంపేస్తానని మరోసారి బెదిరించిన గ్యాంగ్స్టర్
సల్మాన్ ఖాన్(Salman Khan)ను చంపేస్తామని చాలా రోజుల నుంచి బెదిరింపు లేఖలు, వార్తలు వైరల్(Viral) అవుతూనే ఉన్నాయి. గతంలో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) కూడా సల్మాన్ ను చంపేస్తానని అన్నారు. తాజాగా ఆయన మరోసారి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వార్తల్లో నిలిచారు. పంజాబ్ లోని భటిండా సెంట్రల్ జైలులో గ్యాంగ్ స్టర్(Gangster) లారెన్స్ బిష్ణోయ్ ఉన్నారు. ఇటీవలె మీడియా ఇంటరాక్షన్ లో ఈ గ్యాంగ్ స్టర్ షాకింగ్ విషయం చెప్పాడు.

సల్మాన్ ఖాన్(Salman Khan)ను చంపడమే తన జీవిత లక్ష్యమని బిష్ణోయ్(Lawrence Bishnoi) తెలిపారు. సల్మాన్ ఖాన్ కు భద్రత తొలిగిస్తే కచ్చితంగా చంపేస్తానని అన్నారు. ఇంకా బిష్ణోయ్ మాట్లాడుతూ సల్మాన్ రావణుడి కంటే పెద్ద అహంకారి అని, కృష్ణజింకను చంపినందుకు ఖాన్ బిష్ణోయ్ వర్గానికి సల్మాన్ కచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలని అన్నారు. అలా చేస్తే తాను సల్మాన్(Salman Khan)కు ఎటువంటి హాని కలిగించనని అన్నారు.
బిష్ణోయ్ తెగకు చెందిన బికనీర్ లోని గుడికి వెళ్లి సల్మాన్ ఖాన్(Salman Khan) క్షమాపణ చెప్పాలని గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్(Lawrence Bishnoi) డిమాండ్ చేశాడు. తాను నాలుగైదేళ్లుగా సల్మాన్ ఖాన్ ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నానని అన్నారు. 1988లో సల్మాన్ ఖాన్ కృష్ణజింకను వేటాడిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో జంతువును చంపినందుకు జోధ్ పూర్ కోర్టు సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయినప్పటికీ సల్మాన్ బెయిల్ ద్వారా బయటకు వచ్చారు.
గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్(Lawrence Bishnoi) ఆ జింక తెగకు చెందిన వాడు కావడంతో వారికి కృష్ణ జింకలు పవిత్రమైనవి. ప్రస్తుతం బిష్ణోయ్ జైలులో ఉన్నాడు. ఆయనపై డజన్లకొద్దీ క్రిమినల్ కేసులున్నాయి. స్టార్ సింగర్ అయిన సిద్దూ మూస్ వాలా హత్య కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. తాజాగా బిష్ణోయ్ సల్మాన్(Salman Khan) గురించి అలా చెప్పడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.