»Drunk Tourists From Us Found Sleeping Atop Eiffel Tower After Evading Security In France
Eiffel Tower: తప్పతాగి ఈఫిల్ టవరెక్కిన ఇద్దరు అమెరికా టూరిస్టులు.. తర్వాత ఏమైందంటే?
అమెరికాకు చెందిన ఇద్దరు టూరిస్టులు ఆగస్టు 13న రాత్రి 10.40 గంటలకు టిక్కెట్లు కొని ఈఫిల్ టవర్ ఎక్కారు. సందర్శన సమయం ముగియడంతో పర్యాటకులందరినీ భద్రతా సిబ్బంది కిందికి దింపివేశారు. అయితే ఈ ఇద్దరూ మాత్రం భద్రతా సిబ్బందిని తప్పించుకుని అనుమతి లేని ఎత్తైన రెండు మూడు లెవెల్స్ మధ్య ప్రాంతానికి చేరుకున్నారు.
Eiffel Tower:ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఉన్న ఈఫిల్ టవర్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ప్రతి ఒక్కరూ ఈ రొమాంటిక్ ప్లేసును సందర్శించాలని కోరుకుంటారు. అయితే ఇద్దరు అమెరికన్ టూరిస్టులు రాత్రి అంతా దానిపైనే గడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. టవర్ సెక్యురిటీ సిబ్బంది మంగళవారం మాట్లాడుతూ.. ఇద్దరు అమెరికన్ టూరిస్టులు ముందు రోజు రాత్రి సెక్యురిటీ కళ్లుగప్పి అధిగమించి ఈఫిల్ టవర్ను ఎక్కి రాత్రంతా అక్కడే గడిపారని పేర్కొన్నాడు. అమెరికాకు చెందిన ఇద్దరు టూరిస్టులు ఆగస్టు 13న రాత్రి 10.40 గంటలకు టిక్కెట్లు కొని ఈఫిల్ టవర్ ఎక్కారు. సందర్శన సమయం ముగియడంతో పర్యాటకులందరినీ భద్రతా సిబ్బంది కిందికి దింపివేశారు. అయితే ఈ ఇద్దరూ మాత్రం భద్రతా సిబ్బందిని తప్పించుకుని అనుమతి లేని ఎత్తైన రెండు మూడు లెవెల్స్ మధ్య ప్రాంతానికి చేరుకున్నారు.
వారు అప్పటికే పీకల దాకా తాగడంతో మత్తులో అక్కడి నుంచి దిగలేక రాత్రి అక్కడే నిద్రించారు. తెల్లారి ఉదయం సెక్యురిటీ సిబ్బంది గస్తీ సమయంలో వారు అనుమతి లేని ప్రదేశంలో నిద్రించడం చూసి షాక్ అయ్యారు. వారు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే ఫైర్పైటర్లు, రెస్క్యూ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. ఎత్తైన ప్రాంతం వారిని కిందికి దింపినట్టు ఈఫిల్ టవర్ ఆపరేట్ సంస్థ సెటె పేర్కొంది. అనంతరం ఇద్దరిపై క్రిమినల్ కేసు నమోదు చేసి పారిస్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ నిర్వాకంతో సోమవారం ఉదయం గంట ఆలస్యంగా టూరిస్టులను టవర్ పైకి అనుమతించారు. ఈఫిల్ టవర్ను కూల్చి వేస్తామని బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన మర్నాడే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.