Kareena Kapoor Shares Bikini Photo On Her Husband Birthday Special
Kareena Kapoor: భర్త సైఫ్ అలీ ఖాన్ బర్త్ డే సందర్భంగా బికినీ ఫోటోలను కరీనా కపూర్ (Kareena Kapoor) షేర్ చేసింది. వారిద్దరూ కలిసి ఉన్న పిక్స్ ఇన్ స్టలో పోస్ట్ చేసింది. కరీనా- సైఫ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సైఫ్‌కు కరీనా రెండో భార్య.. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సైఫ్ అలీ ఖాన్ ఈ రోజు 53వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా సైఫ్ తన ముందు ఉండి, నవ్వుతూ ఉన్నాడని ఇన్ స్టలో రాసింది.
ఇన్ స్టలో తాను ఏ పిక్ పెట్టాలో కూడా సైఫ్ డిసైడ్ చేస్తారని.. అలా చేసే హక్కు అతనికి ఉందని అంటుంది.
జాన్ నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి.. సైఫ్ గొప్ప ప్రేమికుడు అని.. హ్యాపీ బర్త్ డే అని విష్ చేసింది.
సైఫ్లా మరెవరు ఉండరని.. ఉదారత్వం, చిలిపితనం, దయ గుణం మెండుగా ఉన్నాయని పేర్కొంది.
ఇలా చెప్పుకుంటూ రోజంతా రాయాలి.. కేక్ తినాలిగా అని కరీనా గుర్తుచేసింది.
దేవర మూవీలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ది బకింగ్ హోమ్ మర్డర్స్ మూవీలో కరీనా కపూర్ యాక్ట్ చేస్తోంది.