Kerala bride attends physiotherapy practical exam : పెళ్లికూతురు ముస్తాబులో పరీక్షకు వధువు....! : పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన రోజు. ఆ రోజున ముఖ్యంగా... వధువుగా ముస్తాబు అయిన తర్వాత... ఎవరైనా మండపానికి ఎప్పుడు వెళదామా...? మంచి మంచి స్టిల్స్ తో ఫోటోలు దిగుదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ... యువతి మాత్రం... వధువుగా ముస్తాబైన తర్వాత, పెళ్లి జరిగిన క్షణమే... .... పరీక్ష రాయడానికి కాలేజ్ కి వెళ్లింది.
పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన రోజు. ఆ రోజున ముఖ్యంగా… వధువుగా ముస్తాబు అయిన తర్వాత… ఎవరైనా మండపానికి ఎప్పుడు వెళదామా…? మంచి మంచి స్టిల్స్ తో ఫోటోలు దిగుదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ… యువతి మాత్రం… వధువుగా ముస్తాబైన తర్వాత, పెళ్లి జరిగిన క్షణమే… …. పరీక్ష రాయడానికి కాలేజ్ కి వెళ్లింది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకోగా…. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కేరళకు చెందిన ఓ యువతి కి ఇటీవల వివాహం జరిగింది. ఆమె వివాహం జరిగిన మరుక్షణమే…. పెళ్లి దుస్తులతోనే కాలేజీకి వెళ్లింది. కాలేజీలో కొందరికి ముందుగానే తన పెళ్లి గురించి సమాచారం ఇచ్చింది. పెళ్లయిన వెంటనే తాను ప్రాక్టికల్ ఎగ్జామ్ కు హాజరౌతానని తెలిపింది. పెళ్లి దుస్తులతో కాలేజీకి వచ్చిన ఆమెకు అక్కడ కొందరు స్వాగతం పలికారు. వధువు ల్యాబ్ కోట్ ధరించింది. నేరుగా ప్రాక్టికల్స్ జరుగుతున్న గదిలోకి ప్రవేశించింది. అక్కడ కూడా ఆమెకు స్వాగతం లభించింది. సహచరులు ఆమెకు కేరింతలతో స్వాగతం పలికారు.
ఇదంతా ఆమె కుటుంబ సభ్యులు వీడియోలో బంధించారు. అపురూపమైన ఆ క్షణాలను కెమెరాలో బంధించారు. ఆ తర్వాత సోషల్ మీడియాలోని వివిధ అకౌంటర్లలో అప్ లోడ్ చేశారు. ఆ వీడియోకు విశేష స్పందన లభిస్తోంది. శ్రీలక్ష్మీ అనే ఆ అమ్మాయి ఫిజియోథెరపీ కోర్సు చేస్తోంది. పెళ్లి రోజునే పరీక్ష ఉండడంతో తప్పనిసరిగా హాజరయింది. ఆమె చేసిన ఈ పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. చదువుపై ఆమెకున్న శ్రద్ధను పొగుడుతున్నారు.