భక్తులు ఉన్న ఆలయంలోకి టెర్రరిస్టుల గుంపు ప్రవేశించింది. ముఖానికి నల్లని మాస్క్‌లు, చేతులో గన్ను ధరించి పలువురిని బెదిరించారు. దీంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అంతలో ఒక వ్యక్తి వచ్చి సదరు టెర్రరిస్ట్‌ను ఇవేం పనులు అంటు చెంప పగలగొట్టాడు. తరువాత ఏం జరిగిందంటే..
A common man who was slapped on the cheek by a terrorist in a Maharashtra temple
Slapped terrorist: మహారాష్ట్ర(Maharashtra)లోని స్వామినారాయణ్ ఆలయంలోకి సడెన్ గా ఓ టెర్రరిస్టు(Terrorist) గుంపు ప్రవేశించి నానా హంగామా చేసింది. దీంతో అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా భయానకంగా మారింది. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ప్రాణ భయంతో వణికిపోయారు. ఇదంతా గమనిస్తున్న ఓ భక్తుడికి మాత్రం చిర్రెత్తుకొచ్చింది. టెర్రరిస్టు చేతిలో గన్ ఉన్నప్పటికీ ఏ మాత్రం భయపడకుండా నేరుగా వెళ్లీ అతని చెంప చెళ్లుమనిపించాడు. దీంతో చుట్టు ఉన్న భక్తులు మాత్రమే కాదు. టెర్రరిస్టులు సైతం కంగుతిన్నారు. ప్రస్తుతం ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ధూలె సిటీ(Dust City)లోని ప్రఖ్యాత స్వామినారాయణ్ టెంపుల్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆలయంలోకి నల్లటి దుస్తులు, చేతిలో గన్ తో ఓ టెర్రరిస్ట్ సడెన్ గా ఎంటరయ్యాడు. లోపలికి రావడంతోనే ఓ భక్తుడిని బంధించి, గన్ తో మిగతా వారిని బెదిరించాడు. దీంతో ఆలయంలోని భక్తులు భయంతో వణికిపోయారు. ఓ భక్తుడు మాత్రం కోపం పట్టలేక టెర్రరిస్టు దగ్గరికి వెళ్లి చెంప చెళ్లుమనిపించాడు. ఈ రియాక్షన్ తో సదరు టెర్రరిస్టు కంగుతిన్నాడు.
ఇంతలో అక్కడే మఫ్టీలో ఉన్న పోలీసులు వచ్చి భక్తుడిని ఆపారు. నల్ల దుస్తుల్లో ఉన్న వ్యక్తి నిజమైన టెర్రరిస్ట్ కాదని.. ఇదంతా మాక్ డ్రిల్ అని చెప్పారు. ఓ పోలీస్ అధికారికి టెర్రరిస్ట్ వేషం వేసి ఆలయంలోకి పంపించినట్లు వివరించారు. దీంతో అప్పటి వరకు భయాందోళనలకు గురైన భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. టెర్రర్ దాడుల సమయంలో ప్రజలు ఎలా స్పందిస్తారనే విషయం తెలుసుకోవడంతో పాటు అవగాహన కల్పించేందుకు పోలీసులు ఈ మాక్ డ్రిల్ నిర్వహించామని అధికారులు తెలిపారు.