»8 Year Old Boy Stuck In Lift Starts Doing Homework
8 year old boy లిఫ్ట్‌లో ఇరుక్కొని.. ఏం చక్కా హోం వర్క్ చేస్తూ..
ఓ 8 ఏళ్ల బాలుడు లిప్ట్‌లో ఇరుక్కొన్నాడు. అరిచినా ఎవరూ రాలేదు. దీంతో చేసేదేమీ లేక.. అందులో కూర్చొనే హోం వర్క్ చేశాడు. ఈ ఘటన హర్యానా ఫరీదాబాద్‌లో జరిగింది.
8 year old boy stuck in lift; starts doing homework
8 year old boy: లిఫ్ట్ (lift) అంటే కొందరికీ భయం.. రెండు, మూడు ఫ్లోర్లు ఉంటే మెల్లిగా మెట్ల మీద నుంచి వెళతారు. మరికొందరు యూజ్ చేసేందుకు ఇష్టపడతారు. అయితే లిఫ్ట్‌లో ఇరుక్కుంటే మాత్రం పరిస్థితి వేరు. భయపడిపోతారు.. ఆరుపులు, పెడబొబ్బులతో గోల గోల చేస్తారు. అందులో ఓ ఎనిమిదేళ్ల బాలుడు (8 years old) ఇరుక్కుంటే పరిస్థితి వర్ణణాతీతం.. అరచి గోల చేయాలి.. కానీ సదరు బాలుడు మాత్రం కామ్‌గా ఉండిపోయారు. రెండు, మూడు సార్లు అరిచాడు. ఎవరూ లేకపోవడంతో రాలేదు. దీంతో చేసేదేమీ లేక లిప్ట్‌లో కూర్చొని పెండింగ్ వర్క్ చేశాడు. ఈ ఘటన హర్యానాలో (haryana) జరిగింది.
హర్యానా (haryana) ఫరీదాబాద్ సెక్టార్ 86లో ఓ అపార్ట్ మెంట్లో ఈ ఘటన జరిగింది. నాలుగో అంతస్తులో పవన్ చండీలా ఫ్యామిలీ ఉంటోంది. వీరికి 8 ఏళ్ల కొడుకు ఉంటున్నారు. అదే అపార్ట్ మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్‌కు రోజు ట్యూషన్‌కు వెళతాడు. ఆదివారం సాయంత్రం కూడా ట్యూషన్ కోసం వెళ్లాడు. కానీ లిప్ట్‌లో ఇరుక్కొని పోయాడు. మధ్యలో ఉండటంతో అరిచాడు. సాయం చేయాలని కోరాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. సో.. అతను బయటకు రాలేకపోయాడు.
అక్కడ ఊరికే ఏమీ చేయాలా అని ఆలోచించాడు. పెండింగ్ హోం వర్క్ ఉంది కదా అనుకొని.. దానిని చేశాడు. అలా రెండుగంటల పాటు ఉన్నాడు. ట్యూషన్ సమయం అయిపోయింది.. అయినా కొడుకు ఇంటికి రాలేదు. దీంతో ట్యూషన్ టీచర్‌కు ఫోన్ చేయగా.. అతను ఈ రోజు రాలేదనే సమాధానం వచ్చింది. దీంతో వారు భయపడ్డారు. ఇంటి చుట్టుపక్కల వెతికారు. అయినా నో యూజ్.. లిఫ్ట్ తెరచి చూశాడు. చూడగా అందులో కనిపించాడు. అయితే హోం వర్క్ చేస్తూ ఉండటంతో అందరూ ఆశ్చర్యపోయారు.
ఆ బాలుడి ధైర్య సాహసాలను అందరూ మెచ్చుకుంటున్నారు. లిప్ట్‌లో ఇరుక్కొన్న ఇలా ధైర్యంగా ఉండటం గ్రేట్ అని ప్రశంసిస్తున్నారు. నిజమే.. లిఫ్ట్‌లో ఇరుక్కొని పెద్దలే భయపడతారు. అలాంటిది ఆ పిల్లాడు భయపడలేదు. అదరకుండా.. బెదరకుండా.. తన హోం వర్క్ చేస్తూ కనిపించాడు.