కుక్కలు కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తాయా? అవి కూడా గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతాయా? అనే డౌట్ వస్తోంది కదా మీకు. అవును.. నిజమే.. మనుషులే కాదు.. జంతువులు చేసే పనులకు కూడా గిన్నిస్ బుక్ లో పేరు ఎక్కిస్తారు. తాజాగా 14 కుక్కలు గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నాయి. ఇంతకీ అవి ఏం చేశాయి అంటారా? కాంగా అనే డ్యాన్స్ చేశాయి. హా.. కాంగానా? అదేం డ్యాన్స్ అంటారా?
కాంగా… అనేది ఆఫ్రికాకు చెందిన డ్యాన్స్. కానీ.. దీన్ని లాటిన్ అమెరికా ప్రాంతంలో ఎక్కువగా చేస్తుంటారు. వరుసగా ఒకరి వెనుక మరొకరు నిలుచొని చేసే డ్యాన్స్ అన్నమాట. దీన్ని సాధారణంగా మనుషులు ఏదైనా వేడుక చేసుకునేటప్పుడు చేస్తుంటారు. కానీ.. 14 కుక్కలు ఈ డ్యాన్స్ ను చేయడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు ఆశ్చర్యపోయి వెంటనే వాటిని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించేశారు.
అవి ఎలా డ్యాన్స్ చేశాయో? వాటి డ్యాన్స్ వీడియోను కూడా తమ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఆ వీడియోను చూసి నెటిజన్లు మాత్రం వావ్ అంటున్నారు. అయితే.. ఈ ఫీట్ సాధించడానికి ఆ కుక్కలు చాలా కష్టపడ్డాయి. వరుసలో నిలుచోవడానికి ఒక దాని మీద మరొకటి కాలు వేసి డ్యాన్స్ చేయడానికి వాటికి చాలా రోజుల పాటు ట్రెయినింగ్ ఇచ్చారు. ఆ ట్రెయినింగ్ ఫలితమే ఈ గిన్నిస్ రికార్డు అన్నమాట.
New record: Most dogs in a conga line – 14 by Wolfgang Lauenburger (Germany)
Wolfgang guided Emma, Filou, Fin, Simon, Susy, Maya, Ulf, Speck, Bibi, Katie, Jennifer, Elvis, Charly and Cathy in the long line 🐶 pic.twitter.com/AL6D3vGG5j