YS Sharmila:తెలంగాణలో తమ పార్టీ ప్రభావం ఎక్కువేనని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. 44 సీట్లలో ప్రభావం చూపుతుందని ఢిల్లీకి చెందిన సర్వే సంస్థ పేర్కొందని వివరించారు. అలా అయితే పొత్తుకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి లీడర్ షిప్ ఉన్నా… దాన్ని నిలుపుకొనే సత్తా రాష్ట్రంలో లేదన్నారు. కర్నాటక కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్లు ఉన్నారని పేర్కొన్నారు. అక్కడ డీకే శివకుమార్ చాలా కష్టపడ్డారని.. అందుకే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మిస్డ్ కాల్స్ వస్తున్నాయని.. కాల్స్ లిఫ్ట్ చేయలేదని షర్మిల (YS Sharmila) తెలిపారు. కాల్ లిఫ్ట్ చేస్తే మొదటగా మీడియాకు చెప్తానని తెలిపారు.
డీకే శివకుమార్ ముందు నుంచి పరిచయం అని షర్మిల వివరించారు. ఆయన వైఎస్ఆర్ను ఆదర్శంగా తీసుకున్నాడని పేర్కొన్నారు. అందుకోసమే అధికారంలోకి వచ్చిందని చెప్పారు. డీకే లేకుంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ లేదన్నారు. అందుకే కలిసి అభినందనలు తెలియజేశానని వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ (KCR) పార్టీని బొందపెట్టడం ఖాయం అని షర్మిల (YS Sharmila) అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకులు రాష్ట్రానికి సిగ్గు చేటు అన్నారు. లక్షల మంది బిడ్డల ఆశలు ఆవిరి అయ్యాయని చెప్పారు. సిట్ దర్యాప్తు వేసి సైలెంట్ గా సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్పై మండిపడ్డారు. పేపర్ లీకుల్లో ఐటిశాఖ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని.. ఐటీ శాఖ సరిగ్గా పని చేసి ఉంటే పేపర్ లీకులు అయ్యేవి కావన్నారు. దర్యాప్తు సరిగ్గా చేస్తే కేటీఆర్ పని అయిపోతుందని చెప్పారు. అన్నిశాఖల్లో ప్రతి కంప్యూటర్కు ఐటిశాఖనే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు.పేపర్ లీక్ అయ్యే సరికి తనకేం సంబందం లేదని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నాయని బుకాయిస్తున్నాడని మండిపడ్డారు.
ఏ ప్రతిపక్ష పార్టీ పేపర్ లీక్ చేసిందో చెప్పాలని షర్మిల (Sharmila)అడిగారు. ప్రతిపక్షాల పేపర్ లీకులు చేసినట్లు ఆధారాలు భయటపెట్టాలని సవాల్ విసిరారు. ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా మళ్లీ పరీక్షలు నిర్వహిస్తే లీక్ కాదనే గ్యారెంటి ఏంటి అని అడిగారు. పేపర్లు మళ్లి లీక్ కావని సీఎం గ్యారెంటి ఇవ్వాలని కోరారు. కేసీఆర్ తరపున ఒక అఫిడవిట్ తయారు చేశామని.. డిక్లరేషన్ను కేసీఆర్కు పంపుతున్నామని తెలిపారు.
డిక్లరేషన్ చదువి.. సంతకం పెట్టాలని కోరారు. అఫివడిట్లో పేపర్ లీక్ కాదని రాశామని.. పేపర్ లీకు కాకుండా హామి ఇస్తున్నట్లు ఇందులో ఉందన్నారు. దమ్ముంటే అఫిడవిట్లో సంతకం పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ రెండో సారి ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క ఉద్యోగం భర్తి చేయలేదని షర్మిల అన్నారు. బిశ్వాల్ కమిషన్ ప్రకారం 1.91లక్షల ఉద్యోగాలను భర్తి చేస్తామని రాశామని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని అనుకుంటే ఈ అఫిడవిట్ లో సంతకం పెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు.