రెండు పక్షులు కలిసి బతికాయి. కానీ విధి వారిని విడదీసేందుకు ప్రయత్నించింది. ఓ పక్షి ప్రాణాలు పోవడంతో మరో పక్షి తట్టుకోలేకపోయింది. ఆ పక్షిపైనే తలవాల్సి మరో పక్షి కూడా ప్రాణాలు వదిలింది. ప్రేమకు నిదర్శనమైన ఈ పక్షుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సీఎం కేసీఆర్‌పై బీజేపీ ముఖ్యనేత ఈటల రాజేంధర్ ఫైరయ్యారు. ప్రజల సొమ్ముతో భవనాలు నిర్మిస్తే.. సొంత డబ్బులతో నిర్మించినట్టు కలరింగ్ ఇస్తారెంటీ అని మండిపడ్డారు.
ఏపీలోని గుంటూరు విట్ కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సీనియర్లు, జూనియర్ల మధ్య వాగ్వాదం తలెత్తగా..అది కాస్తా కొట్టుకునే స్థాయికి చేరింది. దీంతో ఇరు వర్గాల విద్యార్థులు తీవ్రంగా తన్నుకున్నారు. అయితే గదుల కేటాయింపు గురించి వారి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణ వీడియో కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓ జిరాఫీ హైనాతో పోరాడి మరీ తన బిడ్డను కాపాడుకుంది. ఎక్కడ జరిగిందో తెలియదుగానీ.. మైదాన ప్రాంతంలో ఓ జిరాఫీ పిల్ల కూర్చొని ఉంది. అది గమనించిన ఓ సారిగా దూకి దాని మెడ పట్టుకుంటుంది.
టైటానిక్ షిఫ్ శకలాలు చూసేందుకు వెళ్లిన ఐదుగురు పర్యాటకులు జల సమాధి అయ్యారు. టైటాన్ సబ్ మెర్సిబుల్ తీవ్ర ఒత్తిడికి గురై పేలిపోయిందని అమెరికా కోస్ట్ గార్డ్ ధృవీకరించింది.
దళపతి విజయ్ హీరోగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా లియో. తాజాగా విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
హీరో ప్రియదర్శి చేతుల మీదుగా 'అర్థమయ్యిందా అరుణ్ కుమార్' వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ 'ఆహా' వేదిక ఈ వెబ్ సిరీస్ జూన్ 30వ తేది నుంచి స్ట్రీమింగ్ కానుంది.
స్పై మూవీ ట్రైలర్(SPY Trailer) లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లోని అల్లుఅర్జున్ మల్టీప్లెక్స్ ఏఏఏ సినిమాస్ లో జరిగింది. ఈ మూవీలో రానా కీలక పాత్రలో కనిపించనున్నాడు. ట్రైలర్ లో విజువల్స్, డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి.
చాలా రోజుల తర్వాత టాలీవుడ్ హీరో సుధాకర్ కోమాకుల 'నారాయణ అండ్ కో' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను హీరో విశ్వక్ సేన్ రిలీజ్ చేశారు.
గేట్ ఇంజినీరింగ్ కాలేజీ సెక్రటరీ కాంతారావుపై హత్యాయత్నం జరిగింది. కాలేజీ పార్ట్‌నర్స్ తనను చంపేందుకు సుఫారీ ఇచ్చారని కోదాడ పోలీసులకు కాంతారావు ఫిర్యాదు చేశారు.
అగ్రరాజ్య అధినేత జో బైడెన్ దంపతులకు ప్రధాని మోడీ స్పెషల్ గిప్ట్స్ అందజేశారు. టెన్ ప్రిన్సిపల్ ఉపనిషద్స్ బుక్ కాపీ, గ్రీన్ డైమండ్, చందనపు బాక్స్, వినాయకుడి ప్రతిమ ఉన్న మరో బాక్స్ ఇచ్చారు.
క్రిస్టియానో రొనాల్డో ఎక్కువ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ క్యాప్‌లు సాధించిన పురుష ఆటగాడిగా కూడా ఖ్యాతి దక్కించుకున్నాడు. దీనితో గిన్నిస్ రికార్డు అతని సొంతం అయింది.
అస్సాంలో తీవ్ర వరదల కారణంగా సుమారు 800 గ్రామాలు నీట మునిగాయి. ఇక్కడ జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. చాలా చోట్ల వంతెనలు, నెట్‌వర్క్ టవర్లు పాడైపోయాయి.
శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మహావీరుడు. ఈ మూవీలో డైరెక్టర్ శంకర్ కూతురు అతిధి శంకర్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
టాలీవుడ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ బ్యాగ్రౌండ్ వాయిస్‌తో భాగ్ సాలే మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. జులై 7న ఈ మూవీ విడుదల కానుంది.