శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మహావీరుడు. ఈ మూవీలో డైరెక్టర్ శంకర్ కూతురు అతిధి శంకర్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
టాలీవుడ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ బ్యాగ్రౌండ్ వాయిస్‌తో భాగ్ సాలే మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. జులై 7న ఈ మూవీ విడుదల కానుంది.
హీరో ధనుష్ బాలీవుడ్ లో తన మూడో సినిమాను ప్రకటించాడు. తాజాగా ఆ చిత్రానికి సంబంధించిన టైటిల్ 'తేరే ఇష్క్ మే'ను ప్రకటిస్తూ మేకర్స్ వీడియోను రిలీజ్ చేశారు. వీడియోలో ధనుష్ లుక్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.
జూపల్లి కృష్ణారావు, అతని బృందం కాంగ్రెస్ పార్టీలోకి రావాలని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్లు రవి, చిన్నారెడ్డితో కలిసి జూపల్లి ఇంటికెళ్లి మరీ ఇన్వైట్ చేశారు.
మహారాష్ట్రలో ఓ మహిళా ఎమ్మెల్యే మున్సిపల్ కార్పొరేషన్ యువ ఇంజనీర్ చెంపచెల్లుమనిపించారు. మీరా భయందర్ ఎమ్మెల్యే గీతా జైన్ ఇద్దరు ఇంజనీర్లను విచారించి, వారిలో ఒకరిని కొట్టగా..ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కోడుతున్నాయి.
పవిత్ర కేదార్‌నాథ్ ఆలయంలో ఓ మహిళ అపచారం చేసింది. శివలింగంపై ఆ మహిళ నోట్ల కట్టలను చల్లింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం రంగబలి. ఈ మూవీ నుంచి లిరికల్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. విడుదలైన ఈ సాంగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
కాజల్ అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్ లో సత్యభామ అనే మూవీ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె కనిపించనున్నారు.
హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం రంగబలి. ఈ సినిమా నుంచి సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. పూర్తి సాంగ్ ను రేపు సాయంత్రం విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
బాలీవుడ్ అందాల భామ అలియా భట్ హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. అక్కడ ఆమె కథానాయికగా కాకుండా విలన్ గా నటిస్తోంది. తాజాగా ఆమె నటిస్తున్న 'హార్ట్ ఆఫ్ స్టోన్' నుంచి మేకర్స్ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.