ప్రవేశ్ శుక్లాపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదైంది. తాగిన మత్తులో ఊగుతూ ఆ వ్యక్తి ఆదివాసి యువకుడిపై మూత్ర విసర్జనకు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చంద్రయాన్ పేలోడ్ ఉన్న క్యాప్సూల్‌ను జీఎస్ఎల్వీ రాకెట్‌తో ఈ రోజు అనుసంధానం చేశారు. సతీశ్ ధావన్ సెంటర్‌లో రాకెట్‌కు చంద్రయాన్ క్యాప్సూల్‌ను ఫిక్స్ చేశారు.
ఎయిర్‌పోర్ట్ నుంచి విమానం టేక్ ఆఫ్ అవడానికి సిద్ధం అవుతోంది. మరికాసేపట్లో విమానం గాల్లోకి ఎగురనుందని సిబ్బంది అనౌన్స్ చేశారు. ఇంతలో ఓ యువకుడు విమానం డోర్ తెరవండి అని గట్టిగా అరుస్తూ డోర్ వైపు పరుగెత్తాడు. ఈ ఘటనతో ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు.
మహారాష్ట్రలోని ధులే(maharashtra Dhule) జిల్లాలో మంగళవారం ఒక కంటైనర్ ట్రక్కు నాలుగు వాహనాలను ఢీకొట్టి, ఆపై హైవేపై ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లడంతో కనీసం 15 మంది మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
తన తొలి చిత్రం “RX100”తో పేరు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) తన కొత్త చిత్రం “మంగళవరం(Mangalavaaram)”తో తిరిగి వస్తున్నాడు. పల్లెటూరి నేపథ్యంలో సాగే సూపర్ నేచురల్ హారర్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది.
ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి ఆకస్మాత్తుగా స్పృహ కోల్పోయి కింద పడ్డాడు. ఆ క్రమంలో ఆ వ్యక్తిని వైన్ షాపు సిబ్బంది పట్టించుకోకుండా రోడ్డు పక్కన పడేశారు. దీంతో అతను అస్వస్థతకు గురై మృత్యువాత చెందాడు. ఇది తెలిసిన అతని భార్య అక్కడకు వచ్చి కోపంతో వైన్ షాపులోని సీసాలను పగులగొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
సింహాచలం(Simhachalam) దిగువన ఆలయ రథాన్ని విశాఖపట్నం సీపీ త్రివిక్రమ్ వర్మ, సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి త్రినాథరావు జెండా ఊపి ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించగా..ఈ కార్యక్రమంలో భక్తులు(devotees) పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మెక్సికో సిటీ పట్టణ మేయర్ మొసలిని వివాహాం చేసుకున్నారు. తమ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు ఈ ఆచారాన్ని 230 ఏళ్లుగా పాటిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది.
మణిపూర్లో 40 రోజుల నుంచి హింస జరుగుతోందని, ప్రజల వలసలు కొనసాగుతుయని ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ప్రజలు ఇళ్లను వదిలి శిబిరాల్లో నివసిస్తున్నారు. వీటన్నింటి దృష్ట్యా మణిపూర్ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Mud Festival: భారతదేశంలో అనేక ఏళ్లుగా కొన్ని ఆచార సంప్రదాయాలను ప్రజలు పాటిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వేడుకలు నిర్వహించుకుంటారు. ఉత్తర గోవా(North Goa)లో కూడా అలాంటి విచిత్రమైన పండుగ జరుపుకున్నారు అక్కడ ప్రజలు.