jayamangala venkata ramana:ఏలూరు జిల్లా కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ (jayamangala venkata ramana) వైసీపీలో చేరారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో (karumuri nageshwar rao) కలిసి ఈ రోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్కు (jagan) శాలువా కప్పి సన్మానించారు. తర్వాత పుష్పగుచ్ఛం అందించారు.
jayamangala venkata ramana:ఏలూరు జిల్లా కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ (jayamangala venkata ramana) వైసీపీలో చేరారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో (karumuri nageshwar rao) కలిసి ఈ రోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్కు (jagan) శాలువా కప్పి సన్మానించారు. తర్వాత పుష్పగుచ్ఛం అందించారు. సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి జయమంగళ వెంకటరమణను పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఆత్మీయంగా హత్తుకుని వీపు తట్టారు. కైకలూరు నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు (tdp leaders) కూడా వైసీపీలో (ycp) చేరారు. ఇటీవల జయమంగళ వెంకటరమణ సీఎం జగన్ను కలవడంతో పార్టీ మారతారని ప్రచారం జరిగింది. ఆయనకు ఎమ్మెల్సీ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
టీడీపీ (tdp) హై కమాండ్ పట్ల వెంకట రమణ అసంతృప్తితో ఉన్నారు. తనకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని భావిస్తున్నారు. ఇంతలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (karumuri nageshwar rao) రంగంలోకి దిగి వెంకట రమణతో చర్చలు జరిపారు. వెంకట రమణకు (venkata ramana) ఎమ్మెల్సీ (mlc) పదవీ ఇచ్చేందుకు సీఎం జగన్ (jagan) అంగీకరించారట. అందుకే ఆయన వైసీపీలో చేరారని తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో ఓ ఎమ్మెల్సీ (mlc) స్థానం ఖాళీ అవుతుంది. ఆ సీటును సీఎం జగన్ వెంకట రమణకు కేటాయించారని సమాచారం. భద్రతను కూడా పెంచింది. నలుగురు గన్ మెన్లను (four gunman) కేటాయించింది.
ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీలో చేరిన టీడీపీ సీనియర్ నేత, కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ. pic.twitter.com/oDFMaeJldV
జయమంగళ వెంకటరమణ వైసీపీలో చేరడంపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర స్పందించారు. వ్యక్తిగత లాభం కోసమే వైసీపీలోకి వెళ్లారని ఆరోపించారు. కైకలూరులో టీడీపీ జెండా ఎగరేస్తామని స్పష్టం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు సూచనతో మరో నాలుగు రోజుల్లో కైకలూరుకు కొత్త ఇంచార్జీని ప్రకటిస్తామని కొల్లు రవీంద్ర (kollu ravindra) వెల్లడించారు.
ఏపీలో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటినుంచే ప్రధాన పార్టీల నేతలు జనంలోకి వెళుతున్నారు. నారా లోకేశ్ (nara lokesh) యువగళం పేరుతో పాదయాత్ర చేపడుతున్నారు. పవన్ కల్యాణ్ (pawan kalyan) వారాహి వాహనంలో రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. సీఎం జగన్ కూడా ప్రజలతో మమేకం అవుతున్నారు. ఆయా నియోజకవర్గల్లో ఆశవాహులు ఇప్పటినుంచే పార్టీ మారుతున్నారు. అలా వెంకట రమణ వైసీపీలో చేరారు.