Delhi man drives car for 3 kms with another man hanging on bonnet
Car Bonnet:కారుతో ఢీ కొట్టి ఈడ్చుకెళ్లడం.. బానెట్‌పై వ్యక్తి ఉన్న తీసుకెళ్లడం ఫ్యాషనైపోయింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) జరుగుతున్నాయి. తాజాగా మరో ఘటన జరిగింది. ఒకతను కారు బానెట్ (Car Bonnet) మీద పడిన వ్యక్తిని రెండు నుంచి 3 కిలోమీటర్ల వరకు తీసుకెళ్లాడు. పైగా అతనే తన కారు మీద పడ్డాడని బుకాయించాడు. సదరు కారు బీహర్ ఎంపీకి చెందినది కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎంపీ చందన్ సింగ్ (chandan singh) డ్రైవర్ రామ్‌చంద్ కుమార్ (Ramchand kumar) కారు డ్రైవ్ చేశాడు. ఆదివారం ఆశ్రమ్ చౌక్ నుంచి నిజాముద్దీన్ వర్గా వరకు వెళ్లాడు. ఆ సమయంలో బానెట్ మీద చేతన్ (chetan) అనే వ్యక్తిని తీసుకెళ్లాడు. చేతన్ (chetan) ఒకరిని దింపి కారులో వచ్చానని.. తన కారును రామ్‌చంద్ కుమార్ కారు తగిలిందని చెబుతున్నాడు. కారు ఎదురుగా నిలబడగా.. కారు నడిపాడని అలా తాను బానెట్ పైకి వచ్చానని చెప్పాడు. అక్కడి నుంచి 3 కిలోమీటర్ల వరకు తీసుకెళ్లాడని.. ఆపాలని చెప్పినా వినలేదని వాపోయాడు. కారు డ్రైవ్ చేసిన సమయంలో రామ్ చంద్ (Ramchand kumar) డ్రింక్ చేసి ఉన్నాడని ఆరోపించాడు.
చేతన్ (chetan) వర్షన్ ఇలా ఉండగా.. రామ్‌చంద్ (Ramchand kumar) మాత్రం అదీ కాదని చెబుతున్నాడు. తన కారు చేతన్ (chetan) వాహనాన్ని ఢీ కొనలేదని పేర్కొన్నాడు. చేతనే తన కారు బానెట్ మీద పడ్డాడని అంటున్నాడు. తన కారు బానెట్ (Car Bonnet) మీద నుంచి దిగాలని కోరానని.. వినిపించుకోలేదని అంటున్నాడు. ఆ తర్వాత తానే కారును ఆపానని వివరించాడు. ఘటనపై పోలీసులు (police) కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్, ర్యాష్ డ్రైవ్ చేశాడని కేసు రిజిష్టర్ చేశారు.
#WATCH | Delhi: At around 11 pm last night, a car coming from Ashram Chowk to Nizamuddin Dargah drove for around 2-3 kilometres with a person hanging on the bonnet. pic.twitter.com/54dOCqxWTh
సుల్తాన్ పూర్లో జనవరి 1వ తేదీన ఇలాంటి ఘటన జరిగింది. 20 ఏళ్ల యువతి టూ వీలర్‌ను ఢీ కొని తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో సదరు యువతి తీవ్ర గాయాలతో మృతిచెందడంతో విషాదం నెలకొంది.