ys sharmila:దయాకర్‌కు దయలేదు.. 5th ఫెయిల్ అయి మంత్రి: షర్మిల ఫైర్
ys sharmila:మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై (errabelli dayakar rao) వైఎస్ షర్మిల (ys sharmila) విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. పాలకుర్తి నియోజక వర్గంలో గల తొర్రూరులో ఈ రోజు బహిరంగ సభలో మాట్లాడారు. మా దయాకర్ రావుకు దయ లేదని ఓ పెద్దాయన అన్నారని తెలిపారు. ఆయన ఓ క్రూరుడు అని.. ఒక కబ్జా కోర్ అని చెప్పాడని తెలిపారు.
ys sharmila:మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై (errabelli dayakar rao) వైఎస్ షర్మిల (ys sharmila) విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. పాలకుర్తి నియోజక వర్గంలో గల తొర్రూరులో ఈ రోజు బహిరంగ సభలో మాట్లాడారు. మా దయాకర్ రావుకు దయ లేదని ఓ పెద్దాయన అన్నారని తెలిపారు. ఆయన ఓ క్రూరుడు అని.. ఒక కబ్జా కోర్ అని చెప్పాడని తెలిపారు. భూమి కనిపిస్తే పాగా వేస్తాడు.. చుట్టూ పక్కల భూములు లాక్కుంటారు అని చెప్పాడని షర్మిల (ys sharmila) వివరించారు. 500 ఎకరాలు పోగు చేసినట్లు చెప్పారు. ఈయనకు దయ ఉంటే.. పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్లు ఎందుకు పూర్తి చేయలేదని అడిగారు. కమీషన్ల కోసం ఆ ప్రాజెక్ట్ లను ఆపాడని షర్మిల విమర్శించారు.
గుర్తురులో 200 ఎకరాలు అంట అని చెప్పారు. అందులో పామాయిల్ వేశాడట.. కంటాయిపాలెంలో 300 ఎకరాలు.. సన్నురులో 100 ఎకరాలు, పెరికవెడులో 80 ఎకరాలు.. ఇవన్నీ మంత్రికి ఎక్కడ నుంచి వచ్చాయని అడిగారు. YSR విగ్రహాన్ని (ysr statue) ఏర్పాటు చేయకుండా ఆపాలని చూశాడట. అక్కడ మహిళలు రాత్రి అంతా అక్కడ చలిమంట వేసుకొని విగ్రహం కట్టించారని చెప్పారు. విగ్రహాన్ని పెట్టించిన వారి లిస్ట్ తీయమన్నాడని షర్మిల పేర్కొన్నారు. వారికి పథకాలు నిలిపివేస్తామని బెదిరించడం ఏంటీ అని అడిగారు.
ప్రజలు ఓట్లు వేస్తే మంత్రి అయ్యింది.. ఆ కృతజ్ఞత కూడా లేదని షర్మిల అన్నారు. ఒకప్పుడు తెలుగు దేశం పార్టీ.. అభివృద్ధి కోసం కేసీఆర్ (kcr) దగ్గర చేరాడట అని విరుచుకుపడ్డారు. టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్‌ను బండ బూతులు తిట్టాడని గుర్తుచేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను సంతలో పశువులు లెక్క కొంటున్నాడు అన్నాడని మండిపడ్డారు. కేసీఆర్‌కి పశువు లెక్క అమ్ముడు పోయావు.. ఎంతకు అమ్ముడు పోయావు ఎర్రబెల్లి దయాకర్ రావు అని అడిగారు. ఎక్కడ అభివృద్ధి .? కనీసం 100 పడకల ఆసుపత్రికి చేతకాలేదని విరుచుకుపడ్డారు. పాలకుర్తిలో డిగ్రీ కాలేజీ కూడా లేదన్నారు. 6 మండలాల్లో 4 మండలాల్లో ఇంటర్ కాలేజీలు కూడా లేవన్నారు.
మహిళ ఎంపిడిఓను పట్టుకొని బాగా ఊపుతున్నావు అని అన్నాడు.. ఇది దొర అనే అహంకారం కాదా అని షర్మిల (ys sharmila) అడిగారు. అసలు మహిళల మీద గౌరవం ఉందా అని అడిగారు. brs నేతలకు మహిళలు అనే గౌరవం లేదన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు 5th ఫెయిల్.. డిగ్రీలు, పీజిలు చదివిన వాళ్లు రోడ్ల మీద తిరగాలి అని అడిగారు. తనది ఆంధ్ర పార్టీ అని ఎర్రబెల్లి అంటున్నారు. అయ్యా ఎర్రబెల్లి ఎవరిది ఆంధ్రా పార్టీ.. వైఎఎస్ఆర్ బిడ్డ, తెలంగాణ గడ్డ మీద పుట్టింది. ఇక్కడే పెరిగింది, ఇక్కడ వ్యక్తినే పెళ్లి చేసుకుందని చెప్పారు. తెలంగాణ నామంతో ఉన్న పార్టీ YSR తెలంగాణ పార్టీ అని చెప్పారు. ఆణిముత్యం లాంటి తెలంగాణ పేరును మీ పార్టీ నుంచి తీసేశారని విమర్శించారు. బందీపోట్ల రాష్ట్ర సమితి అనే పేరు పెట్టుకున్నారని విరుచుకుపడ్డారు. మొన్న నాందేడ్ లో మీటింగ్ పెడితే జై తెలంగాణ అని కూడా అనలేదని గుర్తుచేశారు.