KNR: స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాల ఆధ్వర్యంలో శనివారం వావిలాలపల్లి, బ్యాంక్‌కాలనీ పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛభారత్ ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటారు. కళాశాల ప్రిన్సి పాల్ శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ధనపురి సాగర్, బైరం మహేశ్, ఏసీఓబీ సంపత్‌కుమార్, ఏవో శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు.