NZB: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ ఎంఎస్ఎంఈ 2024 పాలసీలో వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం బోధన్ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్ వికాస్ మహాతోకు వారు వినతి పత్రం అందజేశారు.