ASR: డుంబ్రిగూడ మండలంలోని అరకు మేజర్ పంచాయతీలో నేరేడువలస వీధిలో జల్ జీవన్ మిషన్ నిధులతో తాగునీరు అందించేందుకు ప్రతి చోట కుళాయిలు ఏర్పాటు చేస్తున్నట్టు సర్పంచ్ జి.శారద తెలిపారు. ఈ సందర్భంగా 20 వేల లీటర్లు ట్యాంక్ నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. తాగునీటి పూర్తి స్థాయిలో అందించే సంకల్పంతో 100నుంచి120 గృహలకు తాగునీటి సదుపాయం కల్పిస్తున్నట్టు చెప్పారు.