ఏ ఆర్భాటం లేకుండా సింపుల్గా జీవించడం తనకు నచ్చుతుందని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తెలిపారు. కెరీర్ పరంగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ తనకంటూ ఒక సొంతింటిని కొనుగోలు చేయలేదన్నారు. ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నానన్నారు. ‘సొంతంగా ఇంటిని కొనుగోలు చేయకూడదన్నా. అందుకే అద్దె ఇంట్లోనే ఉంటున్నా. ఆ ఇంటికి పెట్టే డబ్బును బ్యాంకులో దాచుకుని ప్రతినెలా అద్దె కట్టుకుంటే బాగుంటుంది కదా’ అని చెప్పారు.