AP: అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరుపై మంత్రి కొలుసు పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా కోసమే అసెంబ్లీకి మాజీ సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు వస్తారా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి వచ్చి మైక్ ఇవ్వకపోతే అప్పుడు అడగాలన్నారు. రాష్ట్ర సమస్యలు జగన్కు పట్టవని విమర్శించారు. కేవలం ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని అనడం సరికాదన్నారు. అసెంబ్లీకి వస్తే స్పీకర్ మైక్ ఇస్తారని తెలిపారు.