TG: మాజీ మంత్రి KTR.. అతని బృందంతో హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. అమృత్ టెండర్ విషయంలో అక్రమాలు జరిగాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. రూ.8,888కోట్ల విలువైన టెండర్లను తన బామ్మర్దికి సీఎం రేవంత్ రెడ్డి అక్రమంగా కట్టబెట్టారని KTR ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై విచారణ జరిపించాలని కేంద్రమంత్రిని కోరనున్నట్లు తెలుస్తోంది.