ప్రకాశం: దర్శి పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండప నిర్మాణానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దర్శి టీడీపీ ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మీ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. 2025 అక్టోబర్ నాటికి కల్యాణ మండపం నిర్మాణం పూర్తయ్యేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.