మహబూబ్ నగర్: ముదిరాజుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం కోటకదిరలో ముదిరాజ్ సంఘం భవనానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. ముదిరాజుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.