భారత్-యురేషియన్ ఎకనామిక్ యూనియన్ మధ్య ద్వైపాక్షిక ప్రతిపాదిత చర్చలను వేగవంతం చేయాలని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ అధికారులకు ఆదేశించారు. ముంబైలో నిర్వహించిన ఇండియా-రష్యా బిజినెస్ ఫోరంలో మాట్లాడిన మంత్రి.. బ్యాంకింగ్, పేమెంట్, రవాణా సవాళ్లు, బీమా, మార్కెట్ ప్రవేశాలు తదితర సమస్యలకు పరిష్కారం కనుగొనాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెనిస్ మంటురోవ్ పాల్గొన్నారు.