TG: దేశాన్ని విభజించేందుకు మోదీ పరివార్ ప్రయత్నిస్తోందని CM రేవంత్ ఆరోపించారు. రవీంద్రభారతిలో జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో మాట్లాడిన ఆయన.. ‘మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపునకు మైనార్టీలు కృషి చేయాలి. కాంగ్రెస్ వారిని ఓటు బ్యాంకుగా చూడటం లేదు. కుటుంబంగా భావిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వారికి ప్రాధాన్యతనిచ్చాం. దేశంలో మోదీ, గాంధీ పరివార్ మాత్రమే ఉన్నాయి. మోదీని ఓడించే శక్తి రాహుల్ గాంధీకి మాత్రమే ఉంది’ అని అన్నారు.