AP: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి హాజరవుతామని YS జగన్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు. అయితే మండలికి మాత్రం ఆ పార్టీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మండలిలో ఆ పార్టీ నుంచి MLC బొత్స సత్యనారాయణ ప్రతిపక్షనేతగా ఉండటంతో.. సభకు హాజరయ్యారు. ఇదే అంశాన్ని TDP నేతలు ప్రశ్నిస్తూ.. ‘ఇదేం వ్యూహం జగనా’ అంటూ చురకలంటించారు. అసెంబ్లీకి డుమ్మా కొట్టడం.. మండలికి హాజరవడం ఏంటోనంటూ జోకులు వేస్తున్నారు.