NLG: రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్రాన్స్-కో అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన నల్గొండలోని తన కార్యాలయంలో ఎస్పీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ వెంకటేశ్వర్లు, ఇతర విద్యుత్తు అధికారులతో సమీక్ష నిర్వహించారు.