ప్రకాశం: రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో మార్టూరు మండలం వలపర్ల క్రీడాకారులు సత్తాచాటారని పీడీ రవి దేవరాజ్ తెలిపారు. స్థానిక ఉన్నత పాఠశాలలో ప్రతిభచాటిన క్రీడాకారులను బుధవారం సత్కరించి, అభినందించారు. తెనాలిలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-14 హ్యాండ్బాల్ పోటీల్లో 9వ తరగతి చదువుతున్న ఎం లారెన్స్, ఎం.కీర్తి ఉమ్మడి ప్రకాశం జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.