NTR: కంచికచర్ల మండల పరిధిలో బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు లైసెన్సులు తప్పనిసరి అని అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణమూర్తి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేస్తే పేలుడు పదార్థాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వీర్లపాడు కంచికచర్ల మండలాల గ్రామాల పరిధిలో లైసెన్సు లేకుండా బాణాసంచా దుకాణాలు నిర్వహించ రాదని ఆయన సూచించారు.