బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్-3, ఆయన సతీమణి క్వీన్ కెమిల్లా భారత్లో రహస్య పర్యటనకు వచ్చినట్లు తెలుస్తోంది. గత 3 రోజులుగా వారు బెంగళూరులో ఉన్నట్లు సమాచారం. అక్కడి ఓ వెల్నెస్ కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నారట. సమోవాలోని అపియాలో ఈనెల 21-26 మధ్య జరిగిన కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశానికి హాజరైన అనంతరం ఇండియాకు వచ్చారట. కాగా, ఛార్లెస్-3 బ్రిటన్ రాజుగా భాద్యతలు చేపట్టిన తర్వాత భారత్కు రావడం ఇదే తొలిసారి.