చైనాకు ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్ మరో షాక్ ఇచ్చింది. కొవిడ్ సమయంలో ఎదురైన చేదు అనుభవంతో చైనా నుంచి ఐఫోన్ల తయారీని ఇతర దేశాలకు తరలించిన యాపిల్.. యాపిల్ 17 ముందస్తు తయారీని తొలిసారి భారత్లో చేపడుతోంది. ఈ ప్రక్రియను తొలిసారి డ్రాగన్ దేశానికి వెలుపల చేపడుతుండడం గమనార్హం. ఇలా రూపొందిన ఫోన్ను 2025 రెండో అర్ధభాగంలో యాపిల్ సాధారణంగా విడుదల చేయనుంది.