ELR: కలెక్టరేట్లో ఉన్న ఈవీఎం యంత్రాలు, వివిప్యాట్లు భధ్రపరిచే గోడౌన్‌ను బుధవారం జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తనిఖీ చేశారు. ఈవీఎం గోదాము యొక్క తాళములు, సీసీ కెమెరాలు పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలు, మొదలైనవి పరిశీలించారు. అనంతరం సెక్యూరిటీ లాగ్ బుక్‌ను పరిశీలించి అందులో సంతకం చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.