TG: జన్వాడ ఫామ్‌హౌస్ కేసులో రాజ్ పాకాల పోలీసుల విచారణ ముగిసింది. ఆయనను 9 గంటలపాటు మోకిల పోలీసులు విచారించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. విజయ్ మద్దూరి స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగింది. విచారణ మధ్యలో రాజ్ పాకాలను పోలీసులు ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లారు. ఫామ్‌హౌస్‌లో గంటపాటు సోదాలు నిర్వహించారు. గతంలో జరిగిన పార్టీలపై పోలీసులు ఆరా తీసినట్లు తెలుస్తుంది.