NLR: అనంతసాగరం మండల పరిధిలోని చిలకలమర్రిలో పేకాట ఆడుతున్నారని సమాచారంతో ఆత్మకూరు పోలీసులు ఉమ్మడిగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 15 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద 3 కార్లు, 14 ఫోన్లు, రూ.8 లక్షలకు పైచిలుకు నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వేణుగోపాల్ తెలిపారు. ఈ దాడుల్లో మర్రిపాడు, అనంతసాగరం, ఆత్మకూరు, మర్రిపాడు ఎస్సై పాల్గొన్నారు.