TG: మెదక్ జిల్లాకు చెందిన కాట్రాజ్ సుమలత ఇటీవల MBBS సీటు సాధించింది. అయితే, కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలుసుకున్నారు. దీంతో ఆమె చదువు పూర్తయ్యే వరకు అండగా ఉంటామని కోమటిరెడ్డి హామీనిచ్చారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఈ ఏడాది కాలేజీ ఫీజు, పుస్తకాలు తదితర ఖర్చుల కోసం ఆర్దికసాయం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సుమలత, ఆమె తండ్రి మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.