AP: ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం దీపావళి కానుకగా ఆలయాల్లో వేద పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. నెలకు రూ.3 వేల చొప్పున సంభావన రూపంలో నిరుద్యోగ భృతి చెల్లించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సింహాచలం, అన్నవరం, కనకదుర్గ, శ్రీకాళహస్తి, ద్వారకాతిరుమల, శ్రీశైలం, కాణిపాకం ఆలయాల్లోని మొత్తం 600 మంది వేద పండితులకు నిరుద్యోగ భృతి వర్తించనుంది.