ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో గిరిజనులు దీపావళి పండగను దియారీ పేరుతో జరుపుకుంటారు. దీపావళి రోజు తాము వండించిన పంటలకు పెళ్లిళ్లు చేస్తారు. పొలాల మధ్య శ్రీమన్నారాయణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి మనుషుల పెళ్లి మాదిరిగా మేళతాళాలు మోగిస్తూ, పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవికి పూజలు చేసి దీపావళిని అంగరంగ వైభవంగా వేడుక చేసుకుంటారు.