కర్ణాటక CM సిద్ధరామయ్యపై అడ్వకేట్ టీజే అబ్రహం ప్రత్యేక కోర్టును ఆశ్రయించి పరువు నష్టం దావా వేశారు. ‘నా మీద ప్రతీకారం తీర్చుకోవాలనే సిద్ధరామయ్య నన్ను బ్లాక్‌మెయిలర్ అని, నాకు చెడు చరిత్ర ఉందన్నారు. మీరు(సిద్ధరామయ్య) చట్టవిరుద్ధంగా ముడా నుంచి 14 స్థలాలను పొంది నన్ను బ్లాక్‌మెయిలర్ అంటున్నారు. నేను మీపై కోర్టులో పరువు నష్టం దావా వేశాను. మీరు ఎలా తప్పించుకుంటారో చూస్తా’ అని అబ్రహం అన్నారు.