AP: రాష్ట్ర ప్రభుత్వం ‘సూపర్-6’ హామీల అమలులో భాగంగా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. రేపు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఈదుపురంలో సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేసి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గ్యాస్ సిలిండర్లు అందిన 48 గంటల్లోనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.