ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఓటు నమోదుపై అవగాహన, ఎన్నికల, అధికారులు చేపట్టిన కార్యక్రమాలతో ఓటర్ల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాల్లో మొత్తం 23,10,190 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 11,31,150 మంది పురుష ఓటర్లు, 11,78,906 ఇతరులు ఉన్నారు. పురుషుల కంటే మహిళల జనాభానే అధికంగా ఉన్నట్లు కనిపిస్తుంది.