‘క’ సినిమా ప్రీమియర్లకు పాజిటివ్ టాక్ రావడంతో హీరో కిరణ్ అబ్బవరం సంతోషం వ్యక్తం చేశాడు. చాలా కాలం తర్వాత హ్యాపీగా నిద్రపోయానని ట్వీట్ చేశాడు. దీపావళిని సంతోషకరంగా మార్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. కాగా ‘క’ సినిమా దీపావళి కానుకగా ఈరోజు విడుదలైంది. ముఖ్యంగా బీజీఎం సూపర్బ్‌గా ఉందని రివ్యూలలో అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.