APలో నవంబర్ 2 నుంచి ప్రభుత్వం కొత్త కార్యక్రమం అమలు చేయనుంది. ‘మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఏపీ’ పేరుతో అన్ని నియోజకవర్గాల్లో రోడ్లకు ఇరువైపులా కంపచెట్ల తొలగింపు, గుంతలు పూడ్చటం, కల్వర్టుల నిర్మాణం వంటి పనులను ప్రభుత్వం చేపట్టనుంది. ఇందుకోసం రూ.860 కోట్ల నిధులను కేటాయించింది. కాగా ఈ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా ఎస్.కోటలో సీఎం చంద్రబాబు ప్రారంభించి రోడ్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టనున్నారు.