నిజ్జర్ హత్య విషయంలో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌పై మరో దుందుడుకు చర్యకు కెనడా సిద్ధమైంది. రాజ్య ప్రాయోజిత హ్యాకింగ్, సైబర్ గూఢచర్యానికి పాల్పడే దేశాల జాబితాలో భారత్‌ను చేర్చే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు కెనడాకు ముప్పుగా భావించే దేశాల నివేదికలో భారత్ పేరును ప్రస్తావించింది. చైనా, రష్యా, ఇరాన్, ఉత్తరకొరియాతో భారత్‌ను పోలుస్తూ తీవ్ర ఆరోపణలు చేసింది.