PPM: పాలకొండ నగర పంచాయతీ 19వ వార్డులో గురువారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పాలకొండ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ పడాల భూదేవి ఆదేశాల మేరకు 19వ వార్డులో స్థానికులకు సభ్యత్వ నమోదుతో కలిగే ప్రయోజనాలను వివరించినట్లు పాలకొండ టీడీపీ మాజీ టౌన్ అధ్యక్షులు గుమ్మడి సింహాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్థానిక పార్టీ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.