దేశంలోని అన్ని ఎన్నికలను ఒకేరోజు లేదా నిర్దిష్ట కాలవ్యవధిలో సమకాలీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. అయితే, జమిలి ఎన్నికలు అసాధ్యమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రధాని మోదీ చెప్పింది చేయరని, ఈ ఎన్నికలకు సంబంధించిన బిల్లు విషయంలో పార్లమెంటులో అందరినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.